వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే

వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులే

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  మొదట అనుకున్నట్టుగా 10 రోజులు ఉండదని చెప్పారు. తిరుమలకు వచ్చిన విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద సరస్వతిని టీటీడీ ఛైర్మన్, ఆలయ ప్రధాన అర్చకులు కలిశారు. ఉత్సవమూర్తుల విగ్రహాల అరుగుదల అంశాన్ని స్వామీజీ దృష్టికి అర్చకులు తీసుకొచ్చారని ఆయన తెలిపారు. చారిత్రక ఆలయాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని స్వామీజీ చెప్పారన్నారు.