సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య వందే భారత్ రెండో రైలు : ప్రధాని మోదీ

సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య  వందే భారత్ రెండో రైలు :  ప్రధాని మోదీ
  • రేపు వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

సికింద్రాబాద్​,వెలుగు: సికింద్రాబాద్​– వైజాగ్ మధ్య వందే భారత్​ రెండో  రైలు పట్టాలెక్కనుంది. ఈనెల12న ప్రధాని మోదీ వర్చువల్ గా సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​లో జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఒక వందే భారత్ రైలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తుండగా.. 100శాతం కంటే ఎక్కువ సామర్థ్యం ఉండగా.. అదనంగా ప్రయాణికుల సౌకర్యార్థం మరో వందే భారత్ రైలును నడుపనున్నట్టు  దక్షిణ మధ్య రైల్వేఅధికారులు తెలిపారు. 

వందే భారత్ రైలు ( నం.20707) సికింద్రాబాద్ నుంచి ఉదయం 05.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 13.50 గంటలకు - వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో  రైలు (నం. 20708) వైజాగ్ లో మధ్యాహ్నం 14.35 గంటలకు బయలుదేరి రాత్రి 23.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ,సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. తెలంగాణ , ఏపీ మధ్య 6 రోజులు (గురువారం మినహా) నడవనుంది.