వందే భారత్​ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్​ ఇవ్వాలి : వెరబెల్లి రఘునాథ్​రావు

వందే భారత్​ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్​ ఇవ్వాలి : వెరబెల్లి రఘునాథ్​రావు

మంచిర్యాల, వెలుగు : త్వరలో ప్రవేశపెట్టే హైదరాబాద్-నాగపూర్ వందే భారత్ ట్రెయిన్​కు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్​ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు, మాజీ ఎంపీ బి.వెంకటేశ్​కోరారు. సోమవారం ఢిల్లీలో రైల్వే బోర్డ్ చైర్​పర్సన్​ జయవర్మ సిన్హాను కలిసి మెమోరాండం అందజేశారు.

కేరళ, ఏపీ ఎక్స్​ప్రెస్​లకు సైతం హాల్టింగ్​ఇవ్వాలని, మంచిర్యాల నుంచి తిరుపతికి కొత్త రైలును ప్రారంభించాలని కోరారు. మోటపలుకుల తిరుపతి, జోగుల శ్రీదేవి పాల్గొన్నారు.