కైరో: ఇండియా షూటర్లు వాన్షికా చౌదరీ–చిరాగ్ శర్మ జోడీ ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిశారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో వాన్షిక–చిరాగ్ 484.3 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ టోర్నీలో వాన్షికాకు ఇది రెండో స్వర్ణం కాగా, చిరాగ్‌కు రెండో మెడల్ కావడం విశేషం.
జూనియర్ మెన్స్ ఎయిర్ పిస్టల్‌లో ఇప్పటికే కాంస్యం గెలిచాడు. మోహిని సింగ్–హిమాన్షు రాణా 407.4 పాయింట్లతో బ్రాంజ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు. అలెగ్జాండ్రా పిట్రోవా–నికితా డౌబాష్ 467.6 పాయింట్లతో రజతం నెగ్గారు. ట్రాప్ విభాగంలో జుహైర్ ఖాన్, భవ్య త్రిపాఠి ఫైనల్స్‌లో వరుసగా 7, 8 స్థానాలతో సరిపెట్టుకున్నారు.

