
శ్రావణమాసంలో అత్యంత ప్రాముఖ్యత గల రోజు వరలక్ష్మి వ్రతం రోజు. అన్ని రోజులకు విశిష్టత ఉన్నా ఆధ్యాత్మిక పరంగా ఆరోజుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది ( 2025) అలాంటి ప్రాముఖ్యత రోజు ఆగస్టు 8న వచ్చింది. ఆ రోజు సంప్రదాయంగా కొన్ని ప్రత్యేక నియమాలను పాటించాలని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం ఈ కథను చదివిన వారికి, విన్నవారికి సకల కార్యాలూ సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమ అలంకరించుకోవాలి. హిందువులకు చెందిన ప్రతి ముత్తయిదువ తమ కుటుంబ సౌభాగ్యం కోసం విధిగా ఆచరించాల్సిన వ్రతం. ఈ వ్రతం వెనుక ఎన్నో పురాణ గాధలు మనకు కనిపిస్తాయి.
వరలక్ష్మి వ్రతం రోజు ( ఆగస్టు 8)న పాటించాల్సిన నియమాలు
- 1. వరలక్ష్మి వ్రతం చేసే ఇంటి లో ఎవరు ఆ రోజు మద్యం, మాంసం సేవించరాదు. సిగరెట్ త్రాగకూడదు.
- 2 కలశం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి, అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి, అమ్మవారికి హారతి నిచ్చి, ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి. తరువాత కలశం తీయాలి.
- 3. వరలక్ష్మీ వ్రతం రోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో ( 5.30 గంటలనుంచి 7 గంటలవరకు) ఇంటి తలుపులు వేయకూడదు. తెరచి ఉంచాలి
- 4. ఇంటి ముందు గుమ్మాన్ని లక్ష్మి దేవి అని భావించి పసుపు, కుంకుమ పెట్టి అలంకరించాలి.
- 5. వరలక్ష్మి వ్రతం చేసిన వారు మధ్యాహ్నం. విస్తరాకులోనే భోజనం చేయాలి.
- 6. ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం. ..వండి పెట్టకూడదు... కొబ్బరి కాయ కొట్ట కూడదు.
- 7. ఇంటిలో గొడవలు పడకూడదు.
- 8. వాడిన నూనెతో ప్రసాదం చేయరాదు.
- 9. డబ్బులు దండ అమ్మవారికి వేయకూడదు.
ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి, మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంపైన వెండి లేదా కంచు, ఇత్తడి పళ్లాన్ని వుంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని వుంచాలి. ఈ కలశంలో కొత్తచిగుళ్లు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్లను వుంచాలి. కలశాన్ని గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశంపై కొబ్బరికాయను వుంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి.