వర్షాలు కురవాలని దుర్గా ఘాట్ లో వరుణ యాగం

వర్షాలు కురవాలని దుర్గా ఘాట్ లో వరుణ యాగం

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవాలని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్దానం అద్వర్యంలో ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వరుణ యాగం నిర్వహించారు.  ఈ ఉదయం గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించారు మంత్రి శ్రీనివాస్.

రాష్ట్రం సస్యస్యామలంగా ఉండేందుకు లోక కల్యాణార్థమై దుర్గా ఘాట్ లో వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేందుకు ఐదు రోజుల పాటు యాగ కార్యక్రమాలు ఉంటాయని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు. మొదటి మూడు రోజులపాటు వరుణ ఉపాసన, జంపాల కార్యక్రమం, నాల్గవ రోజున వరుణ, రుద్ర హోమం, చివరి రోజు సహస్ర ఘఠాభి షేకం నిర్వహణ ఉంటుందని ఆమె తెలిపారు. గతంలో కూడా వర్షాలు సకాలంలో కురియని సమయంలో వరుణ యాగం నిర్వహించినట్లు కోటేశ్వరమ్మ తెలిపారు.