వరవరరావుతో వీడియో కాల్ మాట్లాడించాలి

వరవరరావుతో వీడియో కాల్ మాట్లాడించాలి

తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని.. వెంటనే ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని వరవరరావు కూతురు పవన కోరారు. ప్రధాని మోడీని హత్య చేసేందుకు కుట్రపన్నారనే ఆరోపణతో వరవరరావుని మహారాష్ట్ర పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఆయన ఇప్పుడు తలోజ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం సరిగాలేకపోవడంతో వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆయన కూతురు పవన ప్రెస్‌మీట్ పెట్టి పోలీసులను కోరారు. ‘మా నాన్నకి కరోనా టెస్ట్ చేశారు. రిపోర్ట్ నెగిటివ్‌గా వచ్చింది. మా నాన్నకి వెంటనే తాత్కాలిక బెయిల్ ఇచ్చి జైలు నుండి విడుదల చేయాలి. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చొరవ తీసుకొని బెయిల్ ఇప్పించాలి. హైదరాబాద్ పోలీసులు మాకు పాసులు ఇస్తామంటున్నారు. కానీ, కోర్ట్ పర్మిషన్ ఉంటే మాత్రమే మా నాన్నని కలవగలం. కోర్ట్ పర్మిషన్ కోసం పిటీషన్ వేశాం. పర్మిషన్ ఇస్తేనే ముంబైకి వెళ్లి కలుస్తాం. వరవరరావుతో వీడియో కాల్ చేయించాలి. మూడు రోజుల నుండి వరవరరావు హెల్త్ బాగాలేదు. తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు చీఫ్ జస్టిస్‌కి లెటర్ రాశాం. జైళ్లలో పరిస్థితి దారుణంగా ఉంది. ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాకు ఆందోళనగా ఉంది’ అని ఆమె అన్నారు.

For More News..