ఎన్నికల హామీలను నెరవేరుస్తాం : ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఎన్నికల హామీలను నెరవేరుస్తాం :  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

పర్వతగిరి, వెలుగు: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అనంతారం, గోపనపల్లి, కొంకపాక, ఏనుగల్లు, సోమవారం, పర్వతగిరి, కల్లెడ, బూర్గుమడ్ల, రోల్లకల్లు, నారాయణపురం, వడ్లకొండ తదితర గ్రామాల్లో శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి, లబ్ధిదారులను సన్మానించారు.

 కొంకపాక, సోమవారం అంగన్​వాడీ సెంటర్లలో సరస్వతీ దేవికి పూజలు చేసి, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. సోమవారంలో రూ.25 లక్షలతో నిర్మించిన జీపీ భవనానికి శంకుస్థాపన, సోమవారం నుంచి గోరు గుట్ట తండా, జగ్గు తండా వరకు ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.2.20 కోట్ల రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీవో శేషాంజన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.