Variety Receipes : వీటి పేర్లు అసహ్యంగా ఉన్నా.. తినేటప్పుడు లొట్టలేస్తారు.. మరి అదే పొట్టిక్కలు.. పిచ్చుక గూళ్ల వంటకాల స్పెషల్

Variety  Receipes : వీటి   పేర్లు అసహ్యంగా ఉన్నా..  తినేటప్పుడు లొట్టలేస్తారు.. మరి అదే పొట్టిక్కలు.. పిచ్చుక గూళ్ల వంటకాల స్పెషల్

 పొట్టిక్కలు.. పిచ్చుక గూళ్లు.. ఈ పేర్లు విటేనే ఎలాగో ఉంది కదా.. మరి ఈ పేర్లతో టేస్టీ రెసిపీలు కూడా ఉన్నాయంట.. ఇవి ఒకదానికొకటి సంబంధం లేదు కాని .. ఈ రెసిపీలను  వంటలు చేసి పెడితే పిల్లలు లాగించేస్తారు.. మరి ఇప్పుడు వాటిని తయారు చేసేందుకు ఏఏ పదార్ధాలు కావాలి.. ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

పొట్టిక్కలు తయారీకి కావాల్సినవి

 

  • పనస ఆకులు: 10
  • మినపప్పు: ఒక కప్పు
  • ఇడ్లీ రవ్వ: రెండు కప్పులు

పొట్టిక్కలు తయారీ విధానం

పప్పు మూడు గంటలు నానబెట్టి, మిక్సీ పట్టి రవ్వ కలిపి ఎనిమిది గంటలు ఉంచాలి.పనస ఆకులను సేకరించి వాటిని శుభ్రం చేయాలి.

 తర్వాత కొబ్బరి ఈనెలతో వాటిని బుట్టలు మాదిరిగా చెయ్యాలి. బుట్టల్లో ఇడ్లీ పిండి వేసి ఆవిరిలో ఉడకబెడితే పొట్టిక్కలు' రెడీ .

ఇడ్లీలకు మనస ఆకుల సారం పట్టి రుచి బాగుంటుంది. అంతేకాదు చాలా ఆరోగ్యం కూడా .బరువు తగ్గాలి అనుకునే వాళ్లు వీటిని తరచుగా తినొచ్చు

పిచ్చుకగూళ్లు తయారీకి కావలసినవి

  • బియ్యప్పిండి: రెండు కప్పులు
  • చక్కెర: రెండు కప్పులు
  • నూనె తగినంత

పిచ్చుకగూళ్లు తయారీ విధానం

పిండిలో కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా కలిపి ఎనిమిది గంటల సేపు నానబెట్టాలి. స్టవ్​ పై పాన్ పెట్టి చక్కెర నీళ్లుపోసి పాకం పట్టాలి. నానబెట్టిన పిండిలో చక్కెర పాకం పోసి జారుగా చెయ్యాలి. 

స్టవ్ పై బాండీ పెట్టి నూనెపోసి మరిగించాలి. తర్వాత జంతికల గొట్టంలో పిండి వేసి మరు
గుతున్న నూనెలో చుట్టలుగా వేసి వేగించాలి. 

చుట్టలు రాగి రంగులోకి వచ్చేంత వరకూ వేగించాలి. వాటిని ప్లేటులోకి తీసి వేడిగా ఉండగానే మడతపెడితే 'పిచ్చుక గూళ్లు' రెడీ తెలంగాణలో గర్రాజీలు అంటారు.

 వీటిని ముస్లింలు పెళ్లి విందుల్లో ఎక్కువుగా చేస్తారు. ఈ రెండు రకాల వెరైటీ వంటకాల పేర్లు వినేటప్పుడు ఇదేం వంటకాలు అనుకున్నా.. తినేటప్పుడు లొట్టలేస్తారు..