రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నరట!

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నరట!
  • టీఎస్ పీఎస్సీ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జాం పేపర్​లో ఇచ్చత్రం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారట! రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రతినెలా ఎంత భత్యం ఇస్తారు? అంటూ ఈ మేరకు హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష పేపర్ లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్​పీఎస్సీ) ఓ ప్రశ్నను సంధించింది. ‘‘టీఎస్ నిరుద్యోగ భృతి పథకం కింద నిరుద్యోగ యువతకు ఇవ్వబడే నెలసరి భత్యం ఎంత?” అని ప్రశ్న ఇచ్చింది.

దీనికి 1,050, 2,025, 3,016, 3,500 అనే నాలుగు ఆప్షన్లు ఇచ్చింది. ఈ నెల17న నిర్వహించిన ఈ పరీక్ష ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లను మంగళవారం రిలీజ్ చేసింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ‘3,016’ అని కూడా మంగళవారం రిలీజ్ చేసిన ‘కీ’లో  పేర్కొంది. అయితే, ఈ ప్రశ్నపై రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మండిపడుతోంది.