ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదో టీ20లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన మైలురాయి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్ ల్లో వరుణ్ 45 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ తో జరగనున్న చివరి టీ20లో 5 వికెట్లు పడగొడితే టీమిండియా తరపున వేగంగా 50 వికెట్లు తీసిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టిస్తాడు. ఈ రికార్డ్ ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ పేరిట ఉంది. 30 మ్యాచ్ ల్లో కుల్దీప్ 50 వికెట్లు పడగొట్టిన ఈ లెగ్ స్పిన్నర్ టీమిండియా తరపున టీ20 ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ 50 వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 100 వికెట్ల క్లబ్ లో చేరతాడు. ఇప్పటివరకు బుమ్రా 79 టీ 20 మ్యాచ్ ల్లో 99 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా మరో వికెట్ పడగొడితే మూడు ఫార్మాట్ లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు నలుగురు మాత్రమే మూడు ఫార్మాట్లలో 100 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. బుమ్రా ఐదో బౌలర్ గా ఈ లిస్ట్ లో చేరతాడు.
శనివారం (నవంబర్ 8) బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతుంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న టీమిండియా చివరి టీ20లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇండియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టీ20లో గెలిస్తే సిరీస్ 3-1 తేడాతో గెలుచుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే 2-2 తో సిరీస్ సమం అవుతుంది. ఈ మ్యాచ్ లో ఇండియా రిజర్వ్ ప్లేయర్లను పరీక్షించాలని కోరుకుంటుంది. సిరీస్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డిను ఆడించే ఆలోచనలో టీమిండియా ఉన్నట్టు ఆలోచిస్తుంది.
కెప్టెన్ సూర్య వైస్ కెప్టెన్ గిల్ ఫామ్‌పై ఆందోళన కొనసాగుతోంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గరపడుతుండటంతో వీళ్లిద్దరు ఫామ్‌లోకి రావడం అత్యవసరం. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కానీ నాలుగో టీ20లో 46 రన్స్ చేసి కొద్దిగా మెరుగయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో అతను చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మిడిలార్డర్‌లో భారీ ఆశలు పెట్టుకున్న తిలక్ వర్మ వైఫల్యం టీమ్ స్కోరును వెంటాడుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ ర్యాంక్ టీ20 హిట్టర్‌గా తన పేరును సుస్థిరం చేసుకుంటున్నాడు. వికెట్ కీపర్ జితేశ్ శర్మ గాడిలో పడాల్సి ఉంది.
ఆస్ట్రేలియాతో ఐదో టీ20కి టీమిండియా ప్లేయింగ్ 11 (అంచనా)
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి , జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకు సింగ్ , అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్
