వరుణ్ డబుల్ ఫీస్ట్

V6 Velugu Posted on Jan 20, 2022

కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కమర్షియల్ హిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం మాత్రమే ఆరాటపడకుండా.. వెరైటీ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైన్ చేయాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. అందుకే రకరకాల జానర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సినిమాలు చేస్తుంటాడు. త్వరలో కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3’తో పాటు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రామా ‘గని’తోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిన్న తన బర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే కావడంతో ఈ రెండు సినిమాలకీ సంబంధించిన అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ వచ్చాయి. ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌3’ నుంచి ఓ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలయ్యింది. ఇది ఓ పాటలోని స్టిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కరెన్సీ పట్టుకుని క్యాజువల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సింపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు వరుణ్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇక కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ‘గని’ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రిలీజయ్యింది. బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నీని చూపించిన ఈ చిన్న వీడియో చాలా ఇంప్రెసివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది. వరుణ్ మేకోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెస్మరైజ్ చేస్తోంది. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబి, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. మొత్తానికి తన పుట్టినరోజు నాడు రెండు డిఫరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తన ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి డబుల్ ఫీస్ట్ ఇచ్చాడు వరుణ్ తేజ్.

Tagged Movies, tollywood, Varun Tej, anil ravipudi, f3, Ghani

Latest Videos

Subscribe Now

More News