
వరుణ్ సందేశ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఏ పళని స్వామి దర్శకత్వంలో జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. కుష్బూ చౌదరి హీరోయిన్ కాగా, మనోజ్ నందం ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ‘వన్ వే టికెట్’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నిర్మాతలు సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘పళని గారు చెప్పిన కథ చాలా నచ్చింది. ఇందులో నేను కొత్త పాత్రను పోషించబోతున్నా. స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. వరుణ్ సందేశ్‌తో వర్క్ చేయడం హ్యాపీగా ఉందని కుష్బూ చౌదరి చెప్పింది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని, ప్రేక్షకులు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని దర్శకుడు పళని స్వామి అన్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని నిర్మాత శ్రీనివాసరావు అన్నారు. నటుడు మనోజ్ నందం, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.