
వైవిధ్యమైన కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నారు మెగా ప్రిన్స్ ‘వరుణ్ తేజ్’. అటు కామెడీ ఇటు యాక్షన్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మాస్, కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటూ తెలివిగా ముందుకెళుతున్నాడు. వరుణ్ తేజ్ 13వ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను పూర్తిగా వెల్లడించకుండా ఓ చిన్నపాటి వీడియోను వరుణ్ తేజ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వీడియోలో సీరియస్ గా స్క్రిప్ట్ ను చదువుతున్నట్లు కనిపిస్తుంది. చివరి పేజీలో ‘జై హింద్’ అని కనిపించగానే.. వరుణ్ తేజ్ లో చిరునవ్వు చిందిస్తాడు. అనంతరం స్క్రిప్ట్ పై ఓ యుద్ధ విమానాన్ని ఉంచుతాడు. కళ్లద్దాలు పెట్టుకుని.. ఓ వైపు చూస్తాడు. భీకరంగా శబ్దాలు చేస్తూ.. ఆ యుద్ధ విమానం ఎగురుతుంది.
సెప్టెంబర్ 19వ తేదీన ప్రకటన అంటూ వీడియో ఎండ్ అవుతుంది. Touch the sky with Glory అంటూ వరుణ్ తేజ్ క్యాప్షన్ జత చేశారు. యుద్ధ నేపథ్యంలో సినిమా ఉంటుందని అర్థమౌతోంది. 2019 జనవరిలో పుల్వామాలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో చిత్రం తెరకెక్కనుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసి గట్టిగా సమాధానం చెప్పింది. ఇందులో ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ హీరోగా నిలిచారు. ఈ ఇన్ స్పైరింగ్ స్టోరీతో సినిమాను మలుస్తున్నారని చర్చ జరుగుతోంది. మూవీలో అభినందన్ పాత్రను వరుణ్ తేజ్ పోషించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇంట్రెస్టింగ్ లా అనిపిస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Touch the sky with Glory!??#VT13 pic.twitter.com/FJ12cm40gR
— Varun Tej Konidela (@IAmVarunTej) September 17, 2022