
ఇటీవల ‘ఆపరేషన్ వాలంటైన్’ చిత్రంతో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా ఆడియెన్స్ ముందుకొచ్చిన వరుణ్ తేజ్.. ప్రస్తుతం ‘మట్కా’ సినిమా చేస్తున్నాడు. కరుణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో వరుణ్ తేజ్ గ్యాంగ్‌స్టర్ తరహా క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. మరోవైపు తన నెక్స్ట్ సినిమాపై కొన్ని రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించనున్నాడని వినిపిస్తున్న వార్తలు దాదాపు నిజమయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ విని ఇంప్రెస్ అయ్యాడట వరుణ్. కొంత గ్యాప్ తర్వాత మేర్లపాక గాంధీ రాసిన ఈ కథ.. క్రైమ్, అడ్వైంచరస్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ‘మట్కా’ షూటింగ్ పూర్తవగానే ఈ మూవీ మొదలుపెట్టాలనే ఆలోచనలో వరుణ్ తేజ్ ఉన్నట్టు తెలుస్తోంది.