వానల కోసం యాదాద్రిలో వరుణయాగం

వానల కోసం యాదాద్రిలో వరుణయాగం

యాదాద్రి నరసింహుని సన్నిధిలో వరుణయాగం వైభవంగా జరిగింది. వేదపండితుల వేదపారాయణాలు, మంత్రోచ్ఛారణల మధ్య యాగం కొనసాగింది. రెండోరోజు శతరుద్రాభిషేకం, స్తపనం, నిత్యారాధన, దేవతా ఆహ్వానం నిర్వహించారు అర్చకులు. పూజల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తి పాల్గొన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురిసి.. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ.. వరుణయాగాన్ని నిర్వహించారు. యాగంలో భాగంగా.. చివరి రోజు.. ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం.. మహాపూర్ణాహుతితో.. యాగం పరిసమాప్తమవుతుంది.