వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.ఎం. సాహ్ని.. చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ... బహుజన ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన పోరాటంలో ఐలమ్మ తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటా యని వెల్లడించారు.