
న్యూఢిల్లీ, వెలుగు: వీరశైవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వెన్న ఈశ్వరప్ప, పట్లోళ్ల సంగ మేశ్వర్ ఆధ్వర్యంలో వీరశైవ లింగాయత్ లు మహా దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బడుగుల, బీద మస్తాన్ రావు, విల్సన్, మాజీ ఎంపీలు పొన్నం, ఆనంద భాస్కర్ ఇతర నేతలు మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ..తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది వీరశైవ లింగాయత్ లు ఉన్నారని తెలిపారు. ఇందులో 90% మంది నిరుపేదలని చెప్పారు. అందువల్ల వీరశైవ లింగాయత్ లను ఓబీసీ లిస్టులో చేర్చాలని నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై గతంలోనూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు.