మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష: హీరో బాలకృష్ణ

మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష:  హీరో బాలకృష్ణ

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న విడుదలైన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఈ సందర్భంగా ‘వీరసింహుని విజయోత్సవం’ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘గోపీచంద్ కథ చెప్పినప్పుడు ‘చెన్నకేశవరెడ్డి’ గుర్తొచ్చింది. ‘వీరసింహారెడ్డి’ లార్జర్ దేన్ లైఫ్ మూవీ. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. శ్రుతి హాసన్, హానీ రోజ్ తమ పాత్రలను పండించారు. దునియా విజయ్, వరలక్ష్మీ పోటాపోటీగా విలనిజం చూపించారు. సాయి మాధవ్ బుర్రా పదునైన మాటలు రాశారు. ఈ సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష’ అన్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘బాలకృష్ణతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఒక ఫ్యాన్‌‌‌‌గా సినిమా తీశా. ఫ్యాన్స్, ఫ్యామిలీస్ కలిస్తేనే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది’అని  చెప్పాడు. ‘ఎనిమిది రోజుల్లోనే బాలకృష్ణ హయ్యెస్ట్ గ్రాసర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఇంకా లాంగ్ రన్ ఉంది’ అన్నారు నిర్మాతలు. మూవీ టీమ్‌‌‌‌తో పాటు హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.