షాద్‌ నగర్‌‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్‌‌

షాద్‌ నగర్‌‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్‌‌

షాద్ నగర్, వెలుగు: షాద్‌నగర్‌‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్‌‌ను ప్రకటించారు.  కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల లిస్టులో షాద్‌ నగర్‌‌ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్ పేరు ఉండడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.  

ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్‌‌ మాట్లాడుతూ..  కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం జరుగుతుందనడానికి నిదర్శనం తనకు టికెట్ ఇవ్వడమేనన్నారు. రజక కుటుంబానికి చెందిన తనకు టికెట్‌ ఇవ్వడం సంతోషకరమన్నారు.  వచ్చే ఎన్నికల్లో షాద్ నగర్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో  గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.