కన్నీళ్లు తెప్పిస్తున్న పచ్చి మిర్చి ధర

కన్నీళ్లు తెప్పిస్తున్న పచ్చి మిర్చి ధర

పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అన్ని కూరగాయల ధరలు 40 రూపాయలకు తగ్గడంలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమపై ఆర్థిక భారం పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజీ టమాట ధర 60 పలుకుతుంది. రైతులు ఈ ఏడాది టమాటా సాగు తక్కువగా చేశారని వ్యాపారస్తులు చెబుతున్నారు. టమాట నిల్వలు లేక ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ఇక పచ్చి మిర్చి ధర కూడా సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కేజీ మిర్చి ధర 60 రూపాయలు పలుకుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి. ప్రైవేటు మార్కెట్లలో అయితే ఇష్టమొచ్చిన ధరలు చెబుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఫెడ్ న్యూయార్క్‌‌లో డైరెక్టర్‌‌‌‌గా తెలుగు వ్యక్తి

ఇండియా, ఫ్రాన్స్​ల మధ్య గట్టి బంధం