లాక్ డౌన్ ఎఫెక్ట్... కూరగాయల రేట్లు డబుల్

లాక్ డౌన్ ఎఫెక్ట్... కూరగాయల రేట్లు డబుల్

హైదరాబాద్, వెలుగు: సిటీలో కూరగాయల రేట్లు పెరిగాయి. లాక్​ డౌన్ కు ముందు ధరలతో పోలిస్తే ప్రస్తుతం డబుల్​ అయ్యాయి. లాక్​డౌన్​తో ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి కావడంలేదు. మరోవైపు గ్రామాల నుంచి రైతులు వచ్చి లాక్​ డౌన్​ సడలింపు సమయంలో కూరగాయలను అమ్మి తిరిగి ఇంటికి వెళ్లేందుకు  ఇబ్బందులు పడుతున్నారు.  దీంతో  రైతుబజార్లకు కూడా  వారు పెద్దగా రావడంలేదు. సొంతూళ్లలోనే కూరగాయలు అమ్ముకుంటున్నట్లు పలువురు రైతులు చెప్తున్నారు. మరికొందరు రైతులు తెల్లవారుజామునే కూరగాయలను వెహికల్​లో సిటీకి తీసుకొచ్చి దళారుల చేతుల్లో పెట్టి  తిరిగి అదే వెహికల్​లో ఊరికెళ్లిపోతున్నారు. సిటీ శివార్ల నుంచి సైతం కూరగాయలు ఎక్కువగా రావడం లేదు. కొన్ని గ్రామాల్లో కరోనా ఎఫెక్ట్  ఎక్కువగా ఉండటంతో రైతులు కూరగాయల సాగు తగ్గించారు. కొందరు పొలంలో ఉన్న పంటను కూడా తీయడం లేదని మెహిదీప్నటం రైతుబజార్​లోని రైతులు తెలిపారు. 

ఉదయం 8 దాటితే అంతా ఖాళీ

లాక్​ డౌన్​తో ఊళ్లకు తిరిగే వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటుండంతో 60 శాతం మంది రైతులు రైతుబజార్లకు రావడంలేదు. దీంతో  మార్కెట్లలో ఉదయం 8 గంటలు దాటితే కూరగాయలు ఖాళీ అవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచే జనం పెద్ద ఎత్తున వస్తుండటంతో తాజాగా ఉన్న కూరగాయలు ఒక్కటి కూడా కనిపించడంలేదు.  రైతుబజార్లలో కూడా ఆఫీసర్లు నిర్ణయించిన ధరలంటే ఎక్కువకే అమ్ముతున్నారు. రైతులు లేకపోవడం.. దళారులు, గ్రూపు సభ్యులు మాత్రమే ఉంటుండటంతో ఎవరి ఇష్టానుసారంగా వారు ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. ఇక బయటి మార్కెట్లో ధరలు చూస్తే ఇంతకు రెండింతలు ఎక్కువగా ఉన్నాయి.  సిటీలో మెహిదీపట్నం,కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, ఎర్రగడ్డ, ఎల్లమ్మబండ, అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పురం, కొత్తపేట, ఫలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుమా,మేడిపల్లి, వనస్థలిపురం, మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట ప్రాంతాల్లో రైతుబజార్లు ఉన్నా యి. ఈ మార్కెట్లకు ఎక్కువగా  రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చేవెళ్ల, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతి ఎక్కువగా అవుతుంది.  వీటితో పాటు కాలనీల్లో  సంచార రైతు బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ద్వారా కూరగాయలను మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శాఖ  అమ్ముతుంది. లాక్​డౌన్​కు ముందు అన్నిచోట్లా డైలీ దాదాపు 600 నుంచి 800 టన్నుల కూరగాయలు అమ్ముడుపోయేవి. కానీ ప్రస్తుతం ఇంతకు తక్కువగానే దిగుమతులు అవుతున్నాయి.  అత్యధికంగా ఆకు కూరగాయలు వచ్చే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ నుంచి ప్రస్తుతం 50 శాతం కూడా రావడంలేదు.

కూరగాయల ధరలు
                            రైతుబజార్​              బయటి మార్కెట్​
టమాట                      12                              30
వంకాయ                    20                              60
బెండకాయ                 30                              60
పచ్చిమిర్చి                 40                              60
బీరకాయ                   42                               80
కాకరకాయ                 35                              70
బిన్నిస్​                      32                               80
క్యారెట్​                       31                               60
చిక్కుడు                    50                               80
క్యాప్సికం                   40                               60