మొన్న కిలో టమాట రూ. 10.. నేడు రూ. 50.. డబుల్ అయిన కూరగాయల ధరలు

మొన్న కిలో టమాట రూ. 10.. నేడు రూ. 50.. డబుల్ అయిన కూరగాయల ధరలు

కొండెక్కిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు
పట్టించుకోని అధికారులు

సరూర్‌నగర్ రైతుబజారులో కొనుగోలుదారులు, వ్యాపారులకు మధ్య గొడవ జరిగింది. వ్యాపారులు కూరగాయలను అధిక ధరలకు అమ్ముతుండటంతో కొనగోలుదారులు గొడవకు దిగారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. దాంతో ప్రజలు నిత్యావసరాల కోసం, కూరగాయల కోసం మార్కెట్లకు ఒక్కసారిగా తరలివచ్చారు. దాంతో ఇదే అదునుగా భావించిన వ్యాపారులు రేట్లు అమాంతం పెంచేశారు. ఈ విషయాన్ని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిరాణ సామాను కోసం, కూరగాయల కోసం జనాలు ఆయా షాపుల వద్ద బారులు తీరారు. ఏ వస్తువుపైనా ధరలు పెంచకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ప్రభుత్వ మాటను లెక్కచేయని వ్యాపారులు.. ధరలు డబుల్ చేసి అమ్ముతున్నారు. దాంతో వ్యాపారులు నిలువుదోపిడి చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. నిన్నటి వరకు టమాట కిలో రూ. 10 ఉండగా.. నేడు రూ. 50కి అమ్ముతున్నారు. పచ్చిమిర్చి కిలో రూ. 20 ఉండగా.. ఇప్పుడు రూ. 120కి అమ్ముతున్నారు. బోర్డు ధరకు సంబంధంలేకుండా వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రజానీకం వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కల్పించుకొని ధరలకు రెక్కలురాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

For More News..

కరోనా దెబ్బకు 13 రాష్ట్రాలు లాక్‌డౌన్

జిల్లాల వారీగా కరోనా పేషెంట్ల వివరాలివే

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం