వెల్లూర్ లోక్ సభ ఎన్నిక రద్దు : నగదు ఎఫెక్ట్

వెల్లూర్ లోక్ సభ ఎన్నిక రద్దు : నగదు ఎఫెక్ట్

తమిళనాడులో విచ్చలవిడి ధనప్రవాహం ఓ లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికను రద్దు చేసింది. తమిళనాడులోని వెల్లూరులో ఇటీవల అధికారులు జరిపిన దాడుల్లో ద్రవిడ మున్నేట్ర కజగం – DMK నాయకుల ఇళ్లలో రూ.12కోట్ల భారీ నగదు పట్టుబడింది. ఏప్రిల్ 1న జరిపిన దాడుల్లో .. ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్లు లేని నగదు .. అత్యంత భారీ మొత్తంలో దొరకడంతో.. అధికారులే షాక్ అయ్యారు.

నగదు ప్రవాహం భారీస్థాయిలో ఉందని… ఈ నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికను రద్దు చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని రాష్ట్రపతి భవన్ కు నివేదించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. దీంతో… వెల్లూరులో లోక్ సభ ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.

ఏప్రిల్ 18న తమిళనాడులోని 38 నియోజకవర్గాలతో వెల్లూరులోనూ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసీ నిర్ణయంతో ఈ ఎన్నికలు ఇపుడు జరగవు. రెండేళ్ల కిందట.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ధన ప్రవాహం కారణంగా.. ఆర్కే నగర్ ఎన్నిక కూడా వాయిదాపడింది. ఇపుడు వెల్లూరు నగదు కారణంగా ఎన్నికలు రద్దయిన తొలి లోక్ సభ సెగ్మెంట్ గా చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది.