వెలుగు కార్టూనిస్ట్​కు ప్రైజ్

V6 Velugu Posted on Jan 20, 2022

  • ఇంటర్నేషనల్​ కార్టూన్​ పోటీల్లో వెలుగు కార్టూనిస్ట్​కు ప్రైజ్
  • గాంధీ థీమ్​తో పోటీలు
  • కారికేచర్​ విభాగంలో జక్కుల వెంకటేశ్​కు థర్డ్​ ప్రైజ్​ 

హైదరాబాద్​, వెలుగు: మహాత్మాగాంధీ థీమ్​తో నిర్వహించిన ఇంటర్నేషనల్​ కార్టూన్​అండ్​ కారికేచర్​ పోటీల్లో ‘వెలుగు’ కార్టూనిస్ట్​ జక్కుల వెంకటేశ్​ థర్డ్​ ప్రైజ్​ గెలుచుకున్నారు. 54 దేశాల నుంచి 408 మంది కార్టూనిస్టులు పోటీ పడగా.. ఫైనలిస్టుల జాబితాలో ఆయన మూడో స్థానాన్ని (కారికేచర్​ కేటగిరీ) సాధించారు. మొదటి స్థానంలో బ్రెజిల్​కు చెందిన యాలిసన్​ ఓర్టిజ్, రెండో స్థానంలో ఇరాన్​కు చెందిన సమీద్​ సూఫీలు నిలిచారు. నిరుడు డిసెంబర్​లో పోటీలను ప్రారంభించగా.. ఈ ఏడాది జనవరి 15న ఫైనలిస్టుల జాబితాను ప్రకటించారు. కారికేచర్​విభాగంలో 51 మంది, కార్టూన్​ విభాగంలో 25 మంది ఫైనల్​ లిస్టులో చోటు సంపాదించారు. మొదటి ప్రైజ్​గా రూ.25 వేలు, రెండో ప్రైజ్​కు రూ.20 వేలు, మూడో ప్రైజ్​కు రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నారు. మధ్యప్రదేశ్​కు చెందిన ‘ఏక్తా పరిషద్’​ అనే స్వచ్ఛంద సంస్థ.. Irancartoon.com అనే ప్లాట్​ఫాం ద్వారా ‘గాంధీ– యాన్​ ఆన్సర్​ ఫర్​ గ్లోబల్​ క్రైసిస్​’ అనే థీమ్​తో ఈ పోటీలను నిర్వహించింది.

Tagged velugu cartoonist, international cartoonist contest, caricature contest

Latest Videos

Subscribe Now

More News