
వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీ క్వార్టర్ ఫైనల్ లో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్, మిర్యాలగూడ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ను మహబూబ్ నగర్ జైళ్ల సూపరిండెంట్ సంతోష్ రాయ్ ప్రారంభించారు. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్ నగర్ జట్టు 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిర్యాల గూడ జట్టు 109 పరుగులకే కుప్పకూలింది. మహబూబ్ నగర్ జట్టులో 77 పరుగులు చేసిన శ్రీనివాస చారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్ విజయంతో మహబూబ్ నగర్ జట్టు సెమీ ఫైనల్ కు చేరింది….