
వరంగల్, వెలుగు : గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వెలుగు – వీ6 మీడియా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 1 శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభ కార్యక్రమం వరంగల్ సీకేఎం గ్రౌండ్స్ లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి..వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం.హరిత, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవికిరణ్, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అతిథులుగా హాజరుకానున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల జట్ల ఎంపిక పూర్తయింది. బుధవారం హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో సెలెక్షన్స్ జరిగాయి. ఇందులో వరంగల్ వెస్ట్, జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల జట్లను ఎంపిక చేశారు. సుమారు 200 మంది క్రీడాకారులు వచ్చారు. వీరిలో జట్టుకు పద్దెనిమిది మంది చొప్పున ఎంపిక చేశారు. కార్యక్రమానికి వరంగల్ అర్బన్ డీవైఎస్‍వో ధనలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 8 వరకు వరంగల్ జిల్లాకు సంబంధించిన క్రికెట్ పోటీలు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లిలలో నిర్వహించనున్నారు.