
హైదరాబాద్ : వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో జరుగుతున్న టీ-20 క్రికెట్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. తొలి సెమీస్ లో కొత్తగూడెంతో నిజామాబాద్ అర్బన్ తలపడుతుండగా.. మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభమయ్యే రెండో సెమీస్ లో మహబూబ్ నగర్, రామగుండం జట్లు పోటీ పడతాయి. సెమీ ఫైనల్స్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామితో కలిసి టాస్ వేసి మ్యాచ్ ప్రారంభించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. టాస్ గెలిచిన నిజామాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
రెండు టీమ్ లు గురువారం జరిగే ఫైనల్లో అమీ తుమీ తేల్చుకుంటాయి. ఫైనల్స్ లో గెలిచిన టీమ్ కు లక్ష రూపాయలు.. రన్నరప్ టీంకు 50 వేల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. బెస్ట్ బ్యాట్స్ మెన్, బెస్ట్ బౌలర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇలా వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన ప్లేయర్స్ కు 5 వేల రూపాయల ప్రైజ్ మనీ అందనుంది.