V6 News

వెలుగు టోర్నీ:జగిత్యాలలో నేటి మ్యాచ్ లు ఎల్లుండికి వాయిదా

వెలుగు టోర్నీ:జగిత్యాలలో నేటి మ్యాచ్ లు ఎల్లుండికి వాయిదా

జగిత్యాల: వెలుగు క్రికెట్ లీగ్ టోర్నమెంట్ లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఇవాళ జరగాల్సిన మ్యాచ్ లు వాయిదాపడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షం కారణంగా జగిత్యాల గీతా విద్యాలయం గ్రౌండ్ తడిసి ముద్దయింది. దీంతో.. ఇవాళ ఉదయం కోరుట్ల vs జగిత్యాల, మధ్యాహ్నం కోరుట్ల vs ధర్మపురి మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఐతే.. మైదానం అనుకూలంగా లేకపోవడంతో.. ఇవాళ జగిత్యాలలో జరిగే మ్యాచ్ లను ఎల్లుండికి పోస్ట్ పోన్ చేశారు. రేపటి మ్యాచ్ లు యథాతథంగా నడుస్తాయని నిర్వాహకులు తెలిపారు.