కేటీఆర్ కష్టంలో మోడీ సగం కష్టపడ్డా.. దేశ జీడీపీ పెరిగేది: వేముల ప్రశాంత్

కేటీఆర్ కష్టంలో మోడీ సగం కష్టపడ్డా.. దేశ జీడీపీ పెరిగేది:  వేముల ప్రశాంత్

మంత్రి కేటీఆర్ కష్టంలో మోడీ సగం కష్టపడ్డా  దేశ జీడీపీ 4 శాతం పెరిగేదన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.  విదేశీ పెట్టుబడులను మెప్పించి ,ఆకర్షించి ఇక్కడికి విదేశీ కంపెనీలు రావడంలో కేటీఆర్ ది కీలక పాత్ర అని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్  కలెక్టరేట్ లో పారిశ్రామిక ప్రగతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్. 3 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. దీంతో 24 లక్షల కొత్త ఐటి ఉద్యోగాలు సృష్టించబడ్డాయన్నారు. టీఎస్ఐపాస్ వల్లే రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. 

2014లో  57 వేల కోట్ల ఐటీ ఎక్స్ పోర్ట్ ఉంటే నేడు 2 లక్షల 44 వేలకు పెరిగాయన్నారు.  2014లో ఐటి ఉద్యోగాలు 3 లక్షలు ఉంటే..  నేడు 9 లక్షలకు పెరిగాయన్నారు.  కేటీఆర్  కృషి వల్ల ఫ్రాక్సన్ కంపెనీ తెలంగాణలో 40 వేల కోట్ల పెట్టుబడి పెట్టారని.. దీంతో లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తలసరి ఆదాయంలో నేడు తెలంగాణ నెంబర్ వన్ లో ఉందని.. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు.