నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : విప్ ఆది శ్రీనివాస్ 

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : విప్ ఆది శ్రీనివాస్ 

కోనరావుపేట,వెలుగు; రైతులు అధైర్య పడొద్దని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్లలో కురిసిన రాళ్లవానకు నష్టపోయిన పంట పొలాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చేతికొచ్చిన పంట నష్టపోవడం బాధాకరమని, నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అంతకుముందు సుద్దాల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో  ఏఎంసీ చైర్మన్ కచ్చకాయలు ఎల్లయ్య , వైస్ చైర్మన్ ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.