సంక్షేమ పథకాలను భిక్షగా వేస్తున్న పాలకులు

సంక్షేమ పథకాలను భిక్షగా వేస్తున్న పాలకులు
  • బామ్ సెఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకట్ జాదవ్

ముషీరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని అమలు చేయకుండా పాలకులు అగ్ర కుల, మనువాదంతో ప్రజలను మధ్య పెడుతున్నారని బామ్ సెఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకట్ జాదవ్ అన్నారు. సంక్షేమ పథకాలను హక్కుగా కాకుండా భిక్షగా వేస్తున్నారని మండిపడ్డారు.  ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బామ్ సెఫ్ రాష్ట్రీయ మూల నివాసి సంఘ్ ఆధ్వర్యంలో పదో  రాష్ట్ర సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల జనగణన చేయకుండా.. వారి అభివృద్ధికి పథకాలను ఏ ప్రతిపాదికన రూపొందిస్తున్నారని ప్రశ్నించారు. ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పూలే అంబేద్కర్ సిద్ధాంతాలతో  రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళి మనోహర్ రావు, దళిత సేన నేషనల్ చైర్మన్ జేబీ రాజు, సయ్యద్ మక్సూద్ అహ్మద్, చెన్నయ్య, కుమార్ హాజరై మాట్లాడారు. లక్ష్మణ్, ప్రసాద్ గౌడ్, పి శంకర్, దాంరామ్, వలిగి ప్రభాకర్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.