
ఎఫ్2, ఎఫ్3 వంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్.. మళ్లీ సేమ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రమిది. ఇదొక ఎక్స్‌ట్రార్డినరీ ట్రై యాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ అని, మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుందని మేకర్స్ చెప్పారు. హీరో, అతని వైఫ్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ క్యారెక్టర్స్‌తో మునుపెన్నడూ లేని ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ ఇస్తుందని అన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.