Chari 111 Trailer:KGF రాకీ భాయ్ స్టైల్లో..వెన్నెల కిషోర్ చారీ 111ట్రైలర్

Chari 111 Trailer:KGF రాకీ భాయ్ స్టైల్లో..వెన్నెల కిషోర్ చారీ 111ట్రైలర్

టాలీవుడ్లో ఈ తరం కమెడియన్స్లో టక్కున గుర్తొచ్చే వారిలో వెన్నెల కిషోర్(Vennela Kishore) ఒకరు.యాక్టర్ వెన్నెల కిషోర్ కమెడియన్గా, డైరెక్టర్గా నిరూపించుకున్నారు. ఇపుడు వెన్నెల కిషోర్ హీరోగా రాణించడానికి ముందుకు వస్తున్నారు. ఫన్, స్పై, యాక్షన్ ఫిల్మ్గా చారీ 111 మూవీ రాబోతుంది. టిజీ కీర్తికుమార్ డైరెక్ట్ చేసిన చారీ 111 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. 

చారీ111ట్రైలర్ స్టార్ట్ అవుతూనే ఇంట్రెస్టింగ్ అంశాన్ని చూపించారు. ఎటువంటి కెమికల్, బయలాజికల్ వెపన్స్ తయారు చేయకూడదని 1992లో ఇండియా పాకిస్తాన్ జాయింట్ అగ్రిమెంట్ చేసుకున్నాయని యాక్టర్ మురళీ శర్మ చెప్పే మాటలు ఆసక్తి కలిగిస్తుంది. సిల్లీ మిస్టేక్స్ చేసే స్పై ఏజెంట్..ఓ పెద్ద కేసును ఎలా సాల్వ్ చేశాడనేది కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఏజెన్సీలోనే చారి పనిచేస్తాడు. ఆయన అసిస్టెంట్ పాత్రలో తాగుబోతు రమేష్ కనిపించిన తీరు..వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ఆకట్టుకుంటుంది. 

మూడు రోజుల్లో ఏడు బ్లాస్టులు చేయాలని టెర్రరిస్టులు ప్లాన్ చేస్తారు. వాళ్లను రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ బ్లాస్టులు జరగకుండా ఎలా అడ్డుకుంది? అందుకోసం చారి ఏం చేశాడు? మ్యాడ్ సైకో సైంటిస్ట్ ఏం చేశాడు? ఈ జన్మలో నువ్వు ఏజెంట్ కాలేవని చారిని మురళీ శర్మ ఎందుకు తిట్టారు? అనేది క్యూరియాసిటీగా ఉంది. 

వెన్నెల కిశోర్ చెప్పిన డైలాగ్ ..‘వయలెన్స్..వయలెన్స్..వయలెన్స్..ఐ లైక్ ఇట్! ఐ డోంట్ అవాయిడ్. బట్, వయలెన్స్ డజెంట్ లైక్ మి. అందుకే అవాయిడ్ చేస్తున్నా’ అంటూ ‘కెజియఫ్’ మూవీలో రాకీ భాయ్ స్టైల్లో డైలాగ్ చెప్పిన తీరుకు థియేటర్స్లో విజిల్స్ పడటం కన్ఫమ్ అనేలా ఉంది. 

Also Read : యుద్ధం జరగాల్సిందే..ఆసక్తిగా రజాకార్ ట్రైలర్

హీరో సుమంత్‌తో మళ్లీ మొదలయ్యింది అనే మూవీ  డైరెక్ట్ చేసిన టీజీ కీర్తి కుమార్.. చారి 111మూవీని  తెరకెక్కిస్తున్నాడు .ఈ మూవీలో మురళీ శర్మ,సత్య,బ్రహ్మాజీ,రాహుల్ రవీంద్రన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సైమన్ కే కింగ్ మ్యూజిక్ అందిస్తుండగాబర్కత్ స్టూడియోస్ బ్యానర్పై అదితి సోనీ నిర్మిస్తుంది. ఈ మూవీ మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.