హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, 2, 3 పోటీ పరీక్షలపై ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌తో ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఉంటుందని టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం నిపుణ చానల్లో ఉదయం 11 గంటల లైవ్ షో ఉంటుందన్నారు. పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు సందేహాలుంటే 040 23540326, 040 23540726 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 4039 కు ఫోన్ చేయాలని సూచించారు. 15 రోజులుగా గ్రూప్ 1, 2, 3తో పాటు ఇతర పోటీ పరీక్షలకు గ్రూప్ గైడెన్స్ పేరుతో టీ శాట్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించామని వేణుగోపాల్ గుర్తు చేశారు.
ఆర్థిక, సామాజిక, విద్యారంగ అంశాలపై ‘ఎక్స్ప్లెయిన్డ్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్’ అనే కార్యక్రమాన్నీ ఇటీవలే ప్రారంభించామన్నారు. షార్ట్ వీడియోల ద్వారా రాజ్యాంగపరమైన అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. టీశాట్ విద్య, నిపుణ చానెళ్లలో ఉదయం 8, రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుందని తెలిపారు.