జ్యోతిష్యం: వృశ్చికరాశిలోకి ..శుక్రుడు.. ఏ రాశుల వారి యోగం పట్టనుంది.. 12 రాశుల వారి జాతకం ఇదే..!

జ్యోతిష్యం:   వృశ్చికరాశిలోకి ..శుక్రుడు.. ఏ రాశుల వారి యోగం పట్టనుంది.. 12 రాశుల వారి జాతకం ఇదే..!

జ్యోతిష్యంలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్రుడు ప్రేమ, మనోజ్ఞత, అందం, సంపద, సౌకర్యం, సంబంధాలు, మాధుర్యం మరియు ఆనందానికి కారకుడు. శుక్రుడు మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో తేలిక, సంతోషం మరియు ఆకర్షణ పెరుగుతుంది. అంతటి ప్రభావం కలిగిన శుక్రుడు 2025 నవంబర్​ 26 వ తేది  ఉదయం 11:27 గంటలకు  వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు.  శుక్రుడి సంచారం  జ్యోతిష్య పండితులు  తెలిపిన వివరాల ప్రకారం  శు  మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశిచక్రాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఏ రాశివారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

మేషరాశి  :  వృశ్చిక రాశిలో శుక్ర సంచారం  వలన  డబ్బు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.  అప్పు తీసుకోవాల్సిన అవసరంఏర్పడుతుంది. కెరీర్ లో పనిభారం పెరుగుతుంది. తెలివిగా ఖర్చు చేయాలని పండితులు సూచిస్తున్నారు.  దంపతుల మధ్య మనస్పర్థలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందదు. ఏ మాట మాట్లాడినా అపార్థాలకు దారితీస్తుంది. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ఆదాయం తగ్గి, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. 

వృషభ రాశి  : ఈ రాశి వారికి శుక్రుడు .. వృశ్చికరాశిలో సంచరించే సమయంలో అనేక ప్రయోజనాలు కలగనున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులకు అన్ని విధాల​ అనుకూలంగా ఉంటుంది.  మంచి లాభాలు రానున్నాయి. గతంలో  రావాల్సిన బకాయిలన్నీ దక్కుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది.  ఆర్దికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  పెళ్లి కోసం ఎదురుచూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

మిథున రాశి : ఈ రాశి వారికి పిల్లల పట్ల ఆందోళన పెరుగుతుంది. యజమానులు పని ఒత్తిడిని పెంచుతారు.అయితే వారసత్వం లేదా కుటుంబ ఆస్తి నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. పనిభారం కాస్త భారంగా ఉంటుంది. వృత్తి, విద్య, ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.  అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఎవరితోకూడా వాదనలు పెట్టుకోవద్దు. ఎక్కువ సమయం దైవ ప్రార్థనలో గడపండి.  కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపుతుంది.  కొత్త పనులు ప్రారంభించేటప్పుడు  పెద్దల సలహాలు తీసుకోండి.

 కర్కాటక రాశి : ఈ రాశి రాశి వారికి ఈ సమయంలో జీవితం మరింత సంతోషంగా మారనుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి, ధ్యానం, పూజలు వంటి వాటిపై మనస్సు మళ్లుతుంది. ఉద్యోగ రంగంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు రావడంతో కెరియర్‌లో ఎదుగుదల సాధ్యమవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించి, ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. గతంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్న వారు ఇప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడతారు. ముందుగా చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 సింహ రాశి: ఈ రాశి  వారికి శుక్రుడు వృశ్చికరాశిలో సంచారం  ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులనుంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  కొత్తగా వ్యాపార లాభాలు పెరుగుతాయి. పెట్టుబడుల ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం రావచ్చు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది. సుఖసమృద్ధి, ఐశ్వర్యం పెరిగి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సందర్భాలు ఏర్పడతాయి. గతంలో చేసిన శ్రమకు తగిన ఫలితం ఈ సమయంలో దక్కుతుంది.

 కన్య రాశి :  ఈ రాశి  శుక్రుడు వృశ్చికరాశిలో సంచారం వలన  ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఏదీ ఒక పట్టాన కలిసి రాదు. రావలసిన డబ్బు చేతికి అందదు. పెళ్లి, ఉద్యోగావకాశాలు చేజారిపోతుంటాయి. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీకు ధైర్యం తగ్గుతుంది. మీరు ఉద్యోగాలు మార్చాల్సి రావచ్చు. వ్యాపారంలో స్వల్ప లాభాలు మరియు అప్పుడప్పుడు నష్టాలు వస్తాయి. ఇల్లు లేదా కారు కొనాలనే కోరిక నెరవేరుతుంది.

 తులారాశి:  శుక్రుడు .. వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి కష్టార్జితం బాగా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాక ఇబ్బంది పడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు మీ ప్రమేయం లేకుండానే అవమానాలు ఎదుర్కొంటారు.   దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాలు నిరాశా నిస్పృహలు కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి కలుగుతుంది.  ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి .  కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేయండి. 

 వృశ్చిక రాశి: వృశ్చికరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వలన ఈ రాశి వారికి  స్నేహితుల నుంచి మీకు తక్కువ మద్దతు లభిస్తుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. మీరు కెరీర్ లో మార్పు గురించి ఆలోచించవచ్చు. కోరికలు నెరవేరుతాయి. ప్రేమ సంబంధాలలో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వృత్తిలో స్థాన చలనంతో పాటు ప్రమోషన్​ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి

ధనుస్సు రాశి :  శుక్రుడు.. వృశ్చిక  రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి  వృత్తి, వ్యాపారంలో అనుకోకుండా లాభాలు చేకూరతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ, వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.  గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి.  అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో శుభకార్యాలు చేయవచ్చు. వ్యాపారంలో డబ్బు చిక్కుకుపోతుంది. ఖర్చులు భారీగా పెరుగుతాయి. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

  మకర రాశి : శుక్రుడు స్థానచలనం ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కేరీర్​ లో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  ఉద్యోగంలో పదోన్నతి సాధించే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఆదాయం పెరిగి, నిల్వలు కూడా మెరుగుపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా వాహనం కొనాలనుకున్న వారు ఈ సమయంలో తమ కోరికను నెరవేర్చుకోగలుగుతారు.


 కుంభ రాశి: శుక్రుడు .. వృశ్చిక రాశిలో మారడం వలన ఈ రాశి వారి జీవితంలో చాలా సానుకూల మార్పులు కలిసి వస్తాయి.  ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్న గోల్డెన్​ టైం ఆసన్నమైంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్​ను అందుకుంటారు. మీరు చేస్తున్న వృత్తిలో చాలా  మంచి పేరు తెచ్చుకునే సమయం వచ్చింది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా కొనసాగుతుంది.

మీన రాశి : శుక్రుడు.. వృశ్చికరాశిలో సంచారం ఈ రాశి వారికి అనేక  సమస్యలు తలెత్తుతాయి. అపార్థాలు, వివాదాలు  ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఆరోగ్య సమస్యలు విజృంభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గి ఒత్తిడి, వేధింపులు పెరగడం కూడా జరుగుతుంది.  వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోండి.అనవసర పరిచయాలు, వ్యసనాల మీద ఖర్చులు పెరుగుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సుఖ సంతోషాలు, మనశ్శాంతి తగ్గుతాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.