- షెడ్యూల్ విడుదల చేసిన పీఆర్, ఆర్డీ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్పోర్ట్స్ కోటాలో నియమితులై తర్వాత తొలగించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూల్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ నెల 10, 11వ తేదీల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అభ్యర్థులందరూ తమ జిల్లా షెడ్యూల్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి స్వీయ ధ్రువీకరణ కాపీలు 3 సెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన తెలిపారు.
10వ తేదీన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్ జిల్లాలు..అలాగే, 11వ తేదీన నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని సృజన పేర్కొన్నారు.
