దేశ వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారిన డైరక్టర్

దేశ వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారిన డైరక్టర్

పన్నేండేళ్ల సినీ జర్నీలో ఇప్పటిదాకా తీసింది ఐదే ఐదు సినిమాలు..అన్నీ ఆడియెన్స్‌‌ని కదిలించే కథలు.. పైగా బ్లాక్‌‌బస్టర్‌‌ హిట్స్‌‌ కూడా..
ఒక స్ట్రాంగ్‌‌ స్టోరీని, అంతే పవర్‌‌ఫుల్‌‌గా స్క్రీన్‌‌పై ప్రజెంట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడతను. అందుకే వెట్రిమారన్‌‌ పేరు కోలీవుడ్‌‌లోనే కాదు.. యావత్‌‌ దేశంలోనూ ఇంట్రెస్టింగ్‌‌ డైరెక్టర్‌‌గా మారుమ్రోగుతోంది..

పన్నేండేళ్ల సినీ జర్నీలో ఇప్పటిదాకా తీసింది ఐదే ఐదు సినిమాలు..అన్నీ ఆడియెన్స్‌‌ని కదిలించే కథలు.. పైగా బ్లాక్‌‌బస్టర్‌‌ హిట్స్‌‌ కూడా..
ఒక స్ట్రాంగ్‌‌ స్టోరీని, అంతే పవర్‌‌ఫుల్‌‌గా స్క్రీన్‌‌పై ప్రజెంట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడతను. అందుకే వెట్రిమారన్‌‌ పేరు కోలీవుడ్‌‌లోనే కాదు.. యావత్‌‌ దేశంలోనూ ఇంట్రెస్టింగ్‌‌ డైరెక్టర్‌‌గా మారుమ్రోగుతోంది..

సినిమా తీయడం అతని స్పెషాలిటీ.  అయినా కూడా ఆ గ్యాప్‌‌ను ఆడియెన్స్‌‌ అస్సలు పట్టించుకోరు. ఎంత లేట్‌‌ అయినా సరే కంటెంట్‌‌ ఉన్న సినిమా అందిస్తాడనే  ఒక నమ్మకం కోలీవుడ్‌‌ ఆడియెన్స్‌‌కి. ఆ నమ్మకానికి తగ్గట్లే సినిమాలు ఆడుతుంటాయి. అయితే ఒక సినిమా కోసం గ్రౌండ్ వర్క్‌‌ చేసేందుకే ఏళ్ల తరబడి టైం తీసుకుంటాడు వెట్రిమారన్‌‌. సెట్‌‌ ప్రాపర్టీస్‌‌, కాస్టూమ్స్‌‌, లొకేషన్స్.. ఇలా ప్రతీదాంట్లోనూ కథ కనిపించేలా చూసుకుంటాడు.
ఎక్కడా ఏ ఎలిమెంటూ మిస్‌‌ కాదు. అతని హార్డ్‌‌ వర్క్ కనిపించేది మొత్తం ఇక్కడే. అంతా రెడీ అయ్యాక షూటింగ్‌‌ని చకచకా కానిచ్చేస్తాడు. ఒక్కో సినిమాకు మాత్రం మూడు, నాలుగు నెలలకు మించి టైం తీసుకోడు.  ఇంత పర్‌‌ఫెక్ట్‌‌గా సినిమాలు తీసినా తానొక గుడ్ డైరెక్టర్‌‌ కాదనేది అతని ఫీలింగ్‌‌. ‘సినిమాలో సీన్లను అప్పటికప్పుడు సిచ్యుయేషన్‌‌ని  బట్టి మార్చాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు కథను నేను అనుకున్నట్లు తీయలేకపోతున్నా. ఆడియెన్స్‌‌కి నా కథను కరెక్ట్‌‌గా కన్వే చేయలేనప్పుడు నేను మంచి దర్శకుడిని ఎలా అవుతా?!’ అని అంటాడు వెట్రిమారన్‌‌.

 ఆణిముత్యాల్లాంటి ఐదు సినిమాలు

కడలూరు(తమిళనాడు)లో పుట్టి, పెరిగిన వెట్రిమారన్‌‌.. ఇంగ్లీష్‌‌ లిటరేచర్‌‌ చేశాడు. సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్‌‌తో మాస్టర్‌‌ డిగ్రీ డిస్‌‌కంటిన్యూ చేశాడు. సౌతిండియా పాపులర్​ డైరక్టర్​ బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌గా కొన్నేళ్లపాటు పని చేశాడు. సోలో డైరెక్టర్‌‌గా చేసిన తొలి ప్రయత్నానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. నిర్మాతలంతా హ్యాండ్‌‌ ఇవ్వడంతో డ్రీమ్‌‌ ప్రాజెక్ట్‌‌ ‘దేస్యా నెడుంచలై 47’ కలగానే మిగిలింది. ఆ తర్వాత ‘పొల్లాదావన్‌‌’తో డైరెక్టర్‌‌గా మారాడు.

పొల్లాదావన్‌‌(2007).. తండ్రిని కష్టపెట్టి బైక్‌‌ కొన్న ఒక మిడిల్‌‌క్లాస్‌‌ కుర్రాడికి.. ఒక రౌడీ గ్యాంగ్‌‌ నుంచి ఎదురయ్యే కష్టాలు.. వాటిని నుంచి అతను ఎలా బయట పడతాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ధనుష్‌‌ హీరోగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌‌గా సక్సెస్‌‌ అయ్యింది. వెట్రిమారన్‌‌ మిగతా సినిమాల్లో ఇదొక్కటే కొంచెం డిఫరెంట్‌‌గా ఉంటుంది. తెలుగులో ఈ సినిమానే ‘కుర్రాడు’ పేరుతో వరుణ్‌‌ సందేశ్‌‌ హీరోగా రీమేక్‌‌ చేశారు.

ఆడుకాలమ్‌‌(2011).. కోడి పందాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. గురువు పెట్టైకారన్‌‌కి అనుచరుడు కరుప్ఫు ఎదురు తిరిగాక.. వాళ్లిద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు తిరుగుతుందనేది థ్రిల్లింగ్‌‌గా ఉంటుంది.  కరుప్పు క్యారెక్టర్‌‌లో ధనుష్ నటించాడు. 58వ నేషనల్‌‌ ఫిల్మ్‌‌ అవార్డుల్లో బెస్ట్‌‌ డైరెక్టర్‌‌, బెస్ట్ స్క్రీన్‌‌ ప్లే, బెస్ట్ యాక్టర్‌‌ అవార్డులను ఆడుకాలమ్‌‌ సొంతం చేసుకుంది. (తెలుగులో పందెం కోళ్లు)

విసారణై(2016).. ఇండియన్‌‌ సినిమాకి ఇంటర్నేషనల్‌‌ లెవెల్‌‌లో గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. నలుగురు కుర్రాళ్లను  పోలీసులు హింసించడం, అనుకోని పరిస్థితుల్లో మరొక అధికారి చేతుల్లో చిక్కుకోవడం, చివరకు ఎన్‌‌కౌంటర్‌‌లో వాళ్ల కథ సమాప్తం కావడం..ప్రధానంగా పోలీసుల చుట్టూ తిరిగే కథ విసారణై.  63వ నేషనల్‌‌ ఫిల్మ్‌‌ అవార్డ్స్‌‌ల్లో బెస్ట్‌‌ ఫీచర్‌‌ ఫిల్మ్‌‌ ఇన్‌‌ తమిళ్‌‌, బెస్ట్‌‌ సపోర్టింగ్‌‌ యాక్టర్‌‌(సముద్రఖని), బెస్ట్ ఎడిటింగ్ కేటగిరీలో అవార్డులు దక్కించుకుంది. అంతేకాదు 2017లో 89వ ఆస్కార్ అవార్డ్స్‌‌ ‘ బెస్ట్‌‌ ఫారిన్‌‌ లాంగ్వేజ్‌‌ మూవీ’ కేటగిరీలో ఈ సినిమా(ఇంటరాగేషన్ పేరుతో) ఎంపికైంది. కానీ, సరైన ప్రమోషన్‌‌ లేకపోవడంతో అవార్డు దక్కించుకోలేకపోయింది. (తెలుగులో విచారణ)

వడచెన్నై (2018).. క్యారమ్‌‌ ప్లేయర్‌‌ అయిన అన్బు,  అనుకోని పరిస్థితుల్లో లోకల్‌‌ గ్యాంగ్‌‌స్టర్స్‌‌తో చేతులు కలుపుతాడు. అయితే వాళ్ల వల్ల తన వాడ ప్రజలకే ముప్పు ఏర్పడుతుంది. సొంత వాళ్లను కాపాడుకునేందుకు  అన్బు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది కథ. హీరో ధనుష్‌‌కి ఇది తొలి భారీ కమర్షియల్ సక్సెస్‌‌. దీనికి సీక్వెల్స్‌‌  రావాల్సి ఉంది.

అసురన్‌‌ (2019).. వెట్రిమారన్ జెట్‌‌ స్పీడ్‌‌తో తీసిన ఏకైక సినిమా ఇది. తమిళనాడులోని పంచమీ భూముల హక్కుల బ్యాక్‌‌ డ్రాప్‌‌తో ఈ స్టోరీ నడుస్తుంది. బ్రిటీషర్లు షెడ్యూల్‌‌ క్యాస్ట్‌‌ వాళ్లకు ఇచ్చిన భూములవి. వాటిని దళితులు ఇతరులకు ఇవ్వడానికి, అమ్ముకోవడానికి వీల్లేదు.  కానీ, శివస్వామి(ధనుష్‌‌) అనే వ్యక్తి  భూములపై కొందరు కన్నేస్తారు. వాళ్ల నుంచి శివస్వామి తన భూముని రక్షించుకునేందుకు పోరాటం చేస్తాడు. ఈ క్రమంలో శివస్వామి కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. అయినా కూడా శివస్వామి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.రచయిత పూమణి ‘వెక్కై’ నవల ఈ సినిమాకి ఇన్‌‌స్పిరేషన్‌‌.