హనుమ కొండలోని ఇంటర్ ఫలితాల్లో వైబ్రంట్ విజయం

హనుమ కొండలోని ఇంటర్ ఫలితాల్లో వైబ్రంట్ విజయం

హనుమకొండ, వెలుగు: ఇంటర్మీడియల్ ఫలితాల్లో హనుమకొండలోని వైబ్రంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు విజయదుందుబి మోగించినట్లు కాలేజీ చైర్మన్ సిరంగి శ్రీనివాస్, డైరెక్టర్ సీహెచ్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆదివారం వారు అభినందించారు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో అల్లపురం రిషీ కీర్తన్ 468, మాలోతు వెన్నెల 468, కంచర్ల పౌర్ణమి 468, బీపీసీలో గుగులోతు అరుంధతి 437, బానోతు అక్షయ 437, పెరుక యోగిత 436 మార్కులు సాధించారన్నారు.

వీరితో పాటు ఎంపీసీలో మరో 48 మంది 460కి పైగా స్కోర్ చేయగా, బీపీసీలో 17 మంది 430కిపైగా మార్కులు సాధించారన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో కందికొండ రంజిత్ 993, పోశాల శ్రీమహర్ష 992, ముసుకు సోనుప్రియ 991, గోనె జాహ్నవి 991, బీపీసీలో అజ్మీర హర్షిత 982, కునుసోతు సాయి 981 మార్కులు సాధించగా, మరో 14 మంది 985కిపైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైబ్రంట్ అకాడమీ ప్రిన్సిపల్ టి.శేషుకుమార్, అడ్మినిస్ట్రేషన్ హెడ్ జి.రఘుపతి, కోఆర్డినేటర్ రామ్ గుమ్మడి తదితరులు పాల్గొన్నారు.