నేవీ వైస్ చీఫ్‌‌‌‌గా త్రిపాఠి బాధ్యతలు

నేవీ వైస్ చీఫ్‌‌‌‌గా త్రిపాఠి బాధ్యతలు

న్యూఢిల్లీ :  భారత నేవీ వైస్ చీఫ్‌‌‌‌గా వైస్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్‌‌‌‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌‌‌‌గా పనిచేశా రు. మహారాష్ట్ర ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన త్రిపాఠి.. 1985లో నేవీలో చేరారు.

కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ వార్‌‌‌‌ఫేర్ స్పెషలిస్ట్ గా,  నేవీ ఫ్రంట్‌‌‌‌లైన్ యుద్ధనౌకల్లో సిగ్నల్ కమ్యూనికేషన్ ఆఫీసర్​గా  పనిచేశారు. వినాశ్, కిర్చ్, త్రిశూల్‌‌‌‌ నౌకలకు నాయకత్వం వహించా రు. 2009లో నౌ సేన మెడల్ లభించింది. 2020లో అతి విశిష్ట సేవా మెడల్​ను కూడా పొందారు.