ఆ దేశాలను ఏకాకిని చేయాలి: వెంకయ్యనాయుడు

ఆ దేశాలను ఏకాకిని చేయాలి: వెంకయ్యనాయుడు

ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఏకాకిని చేయాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం రోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ఆయన నివాళులు అర్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భద్రతాబలగాలకు మద్దతుగా భారతీయ పౌరులందరూ కలిసుండాలని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ట్వీట్ యదావిధిగా..

‘జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా.. మాతృభూమిని ఉగ్రవాదం నుంచి కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన అమరుల స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. భారత్‌లో శాంతికి విఘాతం కలిగిస్తున్న ఉగ్రమూకలను ఓడించేందుకు భద్రతాబలగాలకు మద్దతుగా భారతీయ పౌరులందరూ తమ ఐకమత్యాన్ని చాటాలి.

ఉగ్రవాదం సమస్త మానవాళికి, ప్రపంచ శాంతికి శత్రువులాంటిది. విశ్వశాంతికి, అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాద ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలి. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఏకాకిని చేయాలి’అని ట్వీట్ చేశారు.

For More News..

వీడియో వైరల్: బెంగళూరులో వింత సప్పుడు

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..