బీజేపీని గెలిపించిన దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్ అహంకారానికి, నిరంకుశత్వానికి, స్వార్థపూరిత రాజకీయాలకు, రజాకార్లను తలపించే వ్యవహారశైలికి సమాధి కట్టారన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. కార్యకర్తలు ఎంతో కష్టపడిన ఫలితమే దుబ్బాకలో తమ విజయమన్నారు. ఈ గెలుపును కార్యకర్తలకే అంకితం ఇస్తున్నామని తెలిపారు. ఇటీవలే పార్టీ ఆఫీసు ముందు ప్రాణత్యాగం చేసిన శ్రీనివాస్ స్ఫూర్తి కూడా ఈ విజయంలో భాగస్వామ్యం ఉందన్నారు. 2023లోనూ ఇదే విధంగా గెలుస్తామని, ఈ పరంపరను ఇకముందు కూడా కొనసాగిస్తామన్నారు బండి సంజయ్.
దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంతో రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ.
బీజేపీ విజయం తెలంగాణ ప్రజల విజయమన్నారు బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ ను దుబ్బాక జనం తిప్పికొట్టి.. తండ్రీ కొడుకులకు సరైన గుణపాఠం చెప్పారన్నారు. ఇది కల్వకుంట్ల పాలనకు చెంపదెబ్బ అన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో …ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ ఆఫీసులో స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు.

