రేగడి నేలల్లో.. నవ్వుల చినుకల్లే..

రేగడి నేలల్లో.. నవ్వుల చినుకల్లే..

వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప. తమిళంలో సూపర్ హిట్టయిన ‘అసురన్’కి ఇది తెలుగు రీమేక్‌‌‌‌. వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్​ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు.  షూటింగ్‌‌‌‌తో పాటు  పోస్ట్‌‌‌‌ ప్రొడక్షన్ కూడా కంప్లీటయ్యింది. త్వరలోనే సినిమా  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన మణిశర్మ బర్త్ డే సందర్భంగా నిన్న ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. వెంకటేష్ కొడుకుగా నటించిన కార్తీక్ రత్నం పెళ్లి చూపులకు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నప్పుడు వచ్చే పాట ఇది. ‘చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మి.. చలాకీ చిన్నమ్మి..  ఎలాగే నిన్నిడిచి ఎలాగే ఉండేది’ అంటూ అనంత శ్రీరామ్ రాసిన పాటను ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ ఆకట్టుకునేలా పాడారు.

‘రేగడి నువ్వైతే.. నాగలి నీ నవ్వే.. దున్నితే పండాలి నా పంట’ లాంటి పదాలతో కాన్సెప్ట్‌‌‌‌ను జస్టిఫై చేసేలా మంచి సాహిత్యం కుదిరింది. మెలోడియస్‌‌‌‌ ట్యూన్‌‌‌‌తో మణిశర్మ కూడా మరోసారి మ్యాజిక్ చేశారు.  చక్కని పల్లెటూరి వాతావరణం, పచ్చని పొలాల మధ్య అందమైన విజువల్స్‌‌‌‌తో చక్కగా షూట్ చేశారు. పంచెకట్టు, తలపాగా పెట్టుకుని వెంకటేష్.. డీ గ్లామరస్ లుక్‌‌‌‌లో ప్రియమణి చాలా నేచురల్‌‌‌‌గా ఉన్నారు. ఇటీవల సురేష్​ ప్రొడక్షన్స్ సంస్థ ఎస్పీ మ్యూజిక్ లేబుల్‌‌‌‌ని ప్రారంభించింది. ఇందులో మొట్టమొదటగా ‘నారప్ప’ సాంగ్స్ విడుదలవుతున్నాయి.