సోషల్ మీడియాలో గొర్రెల కాపరి డాన్స్ వైరల్

సోషల్ మీడియాలో గొర్రెల కాపరి డాన్స్ వైరల్

సినిమా పాటలకు డాన్స్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామనైపోయింది. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ తదితర ప్లాట్ ఫామ్స్లో పోస్ట్ చేసే ఇలాంటి వీడియోలు కొందరిని రాత్రికి రాత్రే పాపులర్ చేసేస్తున్నాయి. తాజాగా ఓ గొర్రెల కాపరి బాలీవుడ్ పాటకు చేసిన డాన్స్ నెటిజన్ల మనసు దోచుకుంది. 

ఓ గొర్రెల కాపరి బాలీవుడ్ హీరో గోవింద పాటకు అదిరి పోయేలా స్టెప్పులేశాడు. దుల్హే రాజా టైటిల్ ట్రాక్ కు అచ్చం గోవిందను గుర్తుచేసేలా డాన్స్ చేశారు. అతని పక్కనే ఉన్న ఓ పిల్లాడు సైతం అతన్ని ఫాలో అవుతూ స్పెప్పులేయగా.. మరొకరు గాడిదపై కూర్చొని వేణువు ఊదుతున్నట్లు నటిస్తున్నాడు. ఆ ముగ్గురి వెనుక ఓ గొర్రెల మంద కనిపిస్తోంది. ఆసమ్ డాన్స్ అనే ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ రీల్ ను ఇప్పటి వరకు కొన్ని వేల మంది చూశారు. వారి టాలెంట్ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.