
పెళ్లి అన్నాక అమ్మాయితోపాటు కట్నకానుకలు, పెట్టుబడులు, చదివింపులు, గిఫ్ట్ లు ఇలా చాలా ఉంటాయి.. అసలు పెళ్లి అనగానే కట్నం, బంగారం విషయాలు కామన్.. కట్నం నేరం అయినా అది అసలు పట్టింపే కాదు ఇండియాలో.. అలా అని కట్నం ఇస్తున్నది లోకం అంతా చెప్పాలనుకుంటే ఎలా.. అలా చెబితే ఎలా ఉంటుంది అనే దానికి ఈ వీడియోనే సాక్ష్యం..
సాధారణంలో పెళ్లి అయిందంటే కట్నం ఎంత ఇచ్చారు.. కానుకలు ఏమి ఇచ్చారు... అబ్బాయి తరపు వారు.. అమ్మాయికి ఏమి పెట్టారు.. అమ్మాయి తరపు వారు అబ్బాయికి.. ఆడబిడ్డలకు ఏమి ఇచ్చారు అని బంధువులు చర్చించుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు అత్తగారింట్లో తమ కుమార్తె కష్ట పడకూడదని అన్ని సామాన్లు పంపిస్తుంటారు. ఇది ఆచారమని కొందరంటే.. మరికొందరు లాంఛనాలు అని.. ఇంకొందరు ఇంకేదే పేరుతో పిలుస్తారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా కొంత సొమ్మును.. సామాగ్రిని ముట్ట చెప్పడమే కదా.. మరి
ఇటీవల జరిగిన ఓ వివాహంలో ఇచ్చిన కట్న కానుకలు, బహుమతులను బహిర్గతం చేశారు. కిచెన్ టూల్స్ నుంచి.. ఫ్రిజ్, ఏసీ, ఫ్యాన్, వాషింగ్ మిషన్, కారు వరకు ఇచ్చిన అన్ని వస్తువులను ప్రదర్శించారు. ఆ వస్తువులతో సూపర్ మార్కెట్ మాదిరిగా ఉంది.అందులో వరకట్నాన్ని కూడా చేర్చారా లేదా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. కాని వందలాది వస్తువులను ప్రదర్శించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది.
Look at the dowry display pic.twitter.com/DxWSSw9aGc
— Rosy (@rose_k01) November 26, 2023
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఈ వీడియోను చూస్తే నిషేధిత సాంప్రదాయం ఇంకా కొనసాగుతుందని కొందరు కామెంట్ చేశారు. ప్రేమను అమ్మలేము.. కొనలేమని ఇంకొకరు పోస్ట్ చేశారు. కట్నం అంటే నో అనమని కొందరనగా... మరికొందరు ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉందని Xట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒక వినియోగదారుడు మాత్రం ఇక్కడున్న వస్తువులు.... ఒక పెద్ద బజార్ మాదిరిగా కనపడుతుందని రాసుకొచ్చారు.