పదేళ్ల పాపపై అంత అమానుషం జరిగితే నవ్వెలా వస్తుందో.. పైగా పడిపడి నవ్వడం.. IG రమ్య భారతి వీడియో వైరల్ !

పదేళ్ల పాపపై అంత అమానుషం జరిగితే నవ్వెలా వస్తుందో.. పైగా పడిపడి నవ్వడం.. IG రమ్య భారతి వీడియో వైరల్ !

ఆమె ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నారు. శాంతిభద్రతలను కాపాడటమే ఆమె ప్రథమ కర్తవ్యం. అలాంటి ఆమె ఒక సున్నితమైన అంశం గురించి వివరాలు వెల్లడించేందుకు నిర్వహించిన ప్రెస్ మీట్లో పడిపడి నవ్వుతూ నవ్వులపాలయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలను మూటగట్టుకున్నారు.

ఒక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన గురించి వివరాలు వెల్లడించే క్రమంలో అసలు ఆమె ఎలా నవ్వగలుగుతున్నారని ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. ఖాకీ ఉద్యోగంలో కొనసాగేందుకు ఆమెకు అర్హత లేదని.. వెంటనే ఆమెను విధుల నుంచి తప్పించాలని తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఈ వీడియో చూసిన నెటిజన్లు డిమాండ్ చేశారు.

ఈ మహిళా పోలీస్కు మనసు అనేదే లేదని.. చిన్నారిపై అత్యాచారం జరిగిన అమానుష ఘటన గురించి వివరాలు వెల్లడిస్తూ అంతలా పడిపడి నవ్వడానికి ఆమెకు మనసెలా వచ్చిందని వీడియో చూసిన నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. 

►ALSO READ | మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం

ఈ వీడియోలో నవ్వుతూ కనిపించిన మహిళా పోలీస్.. కోయంబత్తూర్ వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ (IG) R.V.రమ్య భారతి ఐపీఎస్ కావడం గమనార్హం. ఆమె ఈ పదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య గురించి ఒక జాతీయ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇలానే నవ్వుతూ మాట్లాడిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది.