మోడీ ప్రారంభించిన రోడ్డు.. 5నెలల్లోనే నిలువుగా చీలింది..

మోడీ ప్రారంభించిన రోడ్డు.. 5నెలల్లోనే నిలువుగా చీలింది..

అటల్ సేతు, 17,840 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రిడ్జి. 5నెలల కిందట ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలో  నదిపై కట్టిన అతి పెద్ద బ్రిడ్జిగా ఇది రికారదుకెక్కింది. ఇదిలా ఉండగా, 5నెలలు తిరగక ముందే దీనిపై పగుళ్లు రావటం వివాదాస్పదం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఇంత తక్కువ సమయంలోనే పగుళ్లు రావటంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఎండగడుతోంది. బ్రిడ్జిపై రెండు నుండి మూడు అడుగుల మేర పగుళ్లు ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పాఠాలే దీనిపై స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు మహారాష్ట్ర ఏటీఎంలా తయారయ్యిందని, వారు మహారాష్ట్రపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి ఇదొక ఉదాహరణ అని, ఇలాంటి చాలా అంశాలపై విధానసభలో తమ గొంతు వినిపిస్తామని అన్నారు. అటల్ బిహారి వాజ్ పేయిని దేశ ప్రజలు ఎంతగానో గౌరవిస్తారని, కానీ బీజేపీ ఆయన పేరు మీద కూడా అవినీతికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.