video viral: కార్మికుడిపై చేయి చేసుకున్న డీకే శివ కుమార్

video viral: కార్మికుడిపై చేయి చేసుకున్న డీకే శివ కుమార్

కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంతి, కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో దురుసుగా ప్రవర్తించారు. భుజంపై చేయి వేసిన ఓ కార్మికుడి చెంపపై కొట్టాడు. హావేరీలోని సవనూరు టౌన్లో కాంగ్రెస్ అభ్యర్థి వినోదా అసూటి తరపున డీకే శివకుమార్ ప్రచారం చేస్తున్నారు.. అల్లావుద్దీన్ మనియార్‌ అనే వ్యక్తి ఆయన భుజంపై చేయి వేయబోయాడు. 

దీంతో ఒక్కసారిగా సీరియస్ అయి డీకే శివ కుమార్ కార్యకర్తపై చేయి చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ నాయకులు షేర్ చేసుకుంటూ విమర్శలు విసురుతున్నారు. డీకే పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్. కర్ణాటకలోని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ధనికుడు. 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన్ని కాంగ్రెస్ ట్రబుల్ షుటర్‌గా పిలుచుకుంటుంది. కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్‌లో విజయం సాధించినప్పుడు ఆయన సీఎం రేస్‌లో కూడా ఉన్నారు.