
విజయ్ ఆంటోనీ హీరోగా అరుణ్ ప్రభు రూపొందిస్తున్న చిత్రం ‘భద్రకాళి’. రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించి మంగళవారం కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్ 5న విడుదల చేయాలని భావించినా.. కొన్ని అనివార్య కారణాలతో రెండు వారాలు వాయిదా వేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో విడుదల చేస్తోంది.
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి తెలుగు డైలాగ్స్‌ను అందించాడు.