విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ట్రైలర్ రిలీజ్

విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ట్రైలర్ రిలీజ్

విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో ‘విజయ్ ఆంటోనీ’. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన చేరువయ్యారు. తాజాగా ‘హత్య’ సినిమాతో ఆడియెన్స్ ను మరోసారి పలకరించేందుకు సిద్ధమయ్యారు. తమిళంలో ‘కొల్లై’ పేరుతో రూపొందిన ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజైంది. మూవీ ట్రైలర్ ను నేచురల్ స్టార్ ‘నాని’ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సినిమా మొత్తం మోడల్ హత్య చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

అమ్మాయిని ఎవరు హత్య చేశారు ? ఎందుకు చేశారో దీనిని చేధించడానికి విజయ్ చేసిన ప్రయత్నాలు ఫలించాయా ? లేదా ? అనేది కథాంశంగా సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ప్రతిక్షణం ఎంతో సస్పెన్స్ గా ఉండేలా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపిస్తుండగా మీనాక్షి చౌదరి, రితిక సింగ్, రాధికా శరత్ కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, తదితరులు కీలక పాత్రలు పోషించారు. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ ఈ మూవీని నిర్మించింది.